
ఇంజినీరింగ్ విద్య, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అవసరం భారీగా తగ్గొచ్చని ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సగానికిపైగా టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్‌ను రాస్తున్నదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అన్నారు. ఒక్క ఏడాదిలో సాఫ్ట్‌వేర్ కోడ్‌లన్నింటినీ ఏఐ రాయగలదని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై చెప్పారు. ఏఐ వినియోగంతో రాబోయే 18 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పక్కకు తప్పించొచ్చు అనిసోషల్ క్యాపిటల్ సీఈవో పలిహపితియా అభిప్రాయపడ్డారు.