అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మధ్యాహ్న భోజనంలో సాంబార్‌లో బల్లి పడడంతో సుమారు వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో
ఒక్కసారిగా కలకలం రేగింది. హుటాహుటిన పాఠశాలకు చేరుకున్న ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. మరోవైపు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

