
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకూ అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన
టీచర్లకూ టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండురోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు వెలువరించింది.