
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో మే డే వేడుకల్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని.. దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులు మొండి పట్టుదలకు పోకుండా.. సమ్మె ఆలోచనను విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల ఫలితంగా ఆర్టీసీ క్రమంగా లాభాల దిశగా పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు.