
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 22న సెట్స్ లోకి వస్తారని మేకర్స్ ప్రకటించారు. దీని కోసం ఆయన కర్ణాటకకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శక హీరోలకు సంబంధించిన ఓ ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు.