యెమెన్‌లోని ఆడెన్ సముద్ర తీరంలో కామెరూన్ జెండా కలిగిన ఓడ MV ఫాల్కన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఓడలో భారీ పేలుడు కారణంగా మంటలు నౌక అంతటా వ్యాపించాయి. అయితే,
అందులో ఉన్న 24 మంది సిబ్బందిని రక్షించి జిబౌటి కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. శనివారం (అక్టోబర్ 18, 2025) జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నౌకలో ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారని అధికారులు గుర్తించారు.

