కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం హైదరాబాద్లోని కన్హా శాంతి వనం వేదికగా జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రాజెక్ట్ దృష్టి’ కింద భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు కానుంది. గిరిజన వైద్యులను (ట్రైబల్ హీలర్స్) సమాజ ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గిరిజన వైద్యులను అధికారికంగా గుర్తించి, ప్రజారోగ్య వ్యవస్థతో అనుసంధానించే తొలి జాతీయ ప్రయత్నంగా ఈ కార్యక్రమం చరిత్రలో నిలవనుందని చెప్పారు.

