అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ కు ఇచ్చిన పది రోజుల గడువు దగ్గరపడిందన్నారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందన్నారు. అంతా భగవంతుడి దయ! అంటూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని ఇరాన్ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది.

