మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ర్యాలీలను ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తావించారు. ఆయన సభల్లో కనిపించిన భారీ జనసమూహం నిజమైనదా లేదా ‘ఏఐ’ ద్వారా సృష్టించారా? అని ప్రశ్నించారు. ‘భారీ జనసమూహాన్ని పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఖాళీ కుర్చీలను ఆకర్షించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యం లెక్క ఇది. దీనిని అర్థం చేసుకోవడం కష్టం’ అని వ్యాఖ్యానించారు.

