
‘పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని సన్నబియ్యంతో బువ్వ పెట్టే పథకంతో నిజం చేయాలన్నదే నా సంకల్పం. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుంటా. వాటిలో కొన్ని సంక్షేమ పథకాలు చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోతాయి. ఆ కోవలోనిదే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సన్నబియ్య పథకం’ ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని, ఉగాది రోజున సన్నబి య్యం పంపిణీని ప్రారంభించటం తనకెం తో సంతోషకరంగా ఉందని వెల్లడించారు.