
యూట్యూబ్‌లో సద్గురు, ఇషా ఫౌండేషన్ పేరుతో మోసపూరితమైన ఏఐ డీప్‌ఫేక్ యాడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నకిలీ ప్రకటనలను ఆపడానికి గూగుల్ తన వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సద్గురును అరెస్టు చేసినట్లు చూపించే తప్పుడు ప్రకటనలను వెంటనే ఆపాలని కోర్టు స్పష్టం చేసింది. ఇషా ఫౌండేషన్ పదేపదే ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు.. గూగుల్ – ఇషా ఫౌండేషన్ కలిసి కూర్చుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోర్టు సూచించింది.