
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI తాజాగా తీసుకొచ్చిన GPT-5 అధికారిక ప్రకటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఓపెన్ఏఐ… మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది” అని మస్క్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించిందని టెక్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న వ్యంగ్యం, హెచ్చరిక స్వభావం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీసింది.