బిల్ కౌంటర్ ఊసేలేని ఆస్పత్రులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన రాయపూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు
ప్రత్యేకమైన ఆ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ సత్య సాయి సంజీవనీ హాస్పటల్స్ ట్రస్టీల్లో ఒకరైన సునీల్ గవాస్కర్ కూడా పాల్గొన్నారు. సత్యసాయి సంజీవనీ ఆస్పత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి సత్యసాయి చిత్ర పటాన్ని అందజేశారు.

