
సర్కారు కాలేజీల్లో రెండోభాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడమంటే తెలంగాణలో తెలుగును హత్యచేయడమేనని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఇంటర్‌బోర్డు సమీక్షించాలని ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకరశర్మ, ప్రొఫెసర్ కాశీం, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రఘు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వితీయ భాష నిర్ణయం బోర్డు స్వతంత్రంగా తీసుకున్నదా..? ప్రభుత్వ పాలసీయా? అన్నది స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారుమన ప్రాంతంలో తెలుగులో మనమే శిక్షణ ఇవ్వకపోతే ఇతర ప్రాంతాల్లో అవకాశాలు అసలే ఉండవని వాపోయారు.