ఏడారి మధ్యన అద్భుత నగరంగా దుబాయ్ దాన్ని చూస్తే అసూయగా ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంక్షోభాలనైనా అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. “1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ, మరో సాంకేతిక విప్లవం దశలో ఉన్నాం,” అని 2047 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.

