తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరును, ఫోటోలను వాడకుండా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో పథకాల ప్రచారంలో తమ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేరు, ఫోటోలను యథావిధిగా ఉపయోగించుకోవడానికి డీఎంకే ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన ఏఐఏడీఎంకే నాయకుడు సి.వి.షణ్ముగంకు సుప్రీం కోర్టు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.

