సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం(డిసెంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇప్పటికే నడుస్తున్న కొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్లను సంక్రాంతి రద్దీ ముగిసే వరకు మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక స్లీపింగ్ పాడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

