బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ తన సంగీత ప్రయాణంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆయన, ఇకపై సినిమా పాటలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు సమాచారాన్ని తెలియజేస్తూ.. “నేను ముగింపు పలుకుతున్నాను” (I am calling it off) అని పేర్కొన్నారు. గడిచిన ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. దేవుడు నాపై ఎంతో కరుణ చూపాడు అని రాసుకొచ్చారు.

