అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. ఆదివారం ఒక్క రోజే దాదాపు 5 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అమెరికా మీడియా నివేదించింది. సోమవారం మధ్యాహ్నానికి 2,530కి పైగా విమానాలు ఆలస్యం కాగా, 60కి పైగా సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా తనిఖీల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లాస్ఏంజిల్స్, కాలిఫోర్నియా, చికాగో, వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
      
