ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741/- నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ మొత్తాన్ని భక్తులు గత 27 రోజుల్లో (25.11.2025 నుండి 22.12.2025 వరకు) స్వామి, అమ్మవార్లకు సమర్పించిన నగదు అని వెల్లడించారు. 57 USD, 47 సింగపూర్ డాలర్లు, 20 సౌది రియాల్స్, 30 దిర్హమ్స్, 80 ఆస్ట్రేలియా డాలర్లు,15 పౌండ్స్, 25 కెనడా డాలర్లు హుండీలో వేశారు విదేశీ భక్తులు.

