
శ్రీశైలంమల్లికార్జున స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాన మంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. ప్రధాన మంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు,మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.