స్కామ్ వివాదంతో అసలు ఏమాత్రం సంబంధం లేని వివాదంలోకి నన్ను లాగారు అని మంగ్లీ కన్నీరు మున్నీరు అయ్యారు. సుబ్బారావు అనే న్యాయవాది సెలేబ్రిటిగా మారాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యం. అందుకే ఇలాంటి వివాదాలు పెట్టుకుంటున్నాడు. సుబ్బారావుకి భరతనాట్యం తెలుసు. సినిమాలు అంటే పిచ్చి. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను ఇలా ఇరికించాలి అని ప్రయత్నిస్తున్నాడు అంటూ మంగ్లీ తీవ్ర ఆరోపణలు చేసింది.

