పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి కొత్త చరిత్ర లిఖించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా శీతల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ ఫైనల్లో జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌దేవి 146-143తో ప్రపంచ నంబర్‌వన్, తుర్కియే ఆర్చర్ ఒజ్నుర్ కురె గిరిడిపై చారిత్రక విజయం సాధించింది.

