నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అవమానాలను భరించలేక, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను చేయని తప్పుకు కమిషనర్ అందరి ముందూ తనను నీచంగా దూషించారని సోమిరెడ్డి పేర్కొన్నారు. ‘వెధవ, ఇడియట్’ వంటి మాటలు అన్నప్పుడు, కనీసం అలా అనొద్దని చెప్పినా, నలుగురు సహోద్యోగుల ముందు తనను అవమానించారని. తన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

