
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. గోతుల్లో నీరు చేరింది. రాత్రి వేళల్లో తెలియని వ్యక్తులు రోడ్డు అనుకుని ఆ గోతుల్లో పడే ప్రమాదం ఏర్పడింది. ప్రమాద తీవ్రతను పసిగట్టిన కానిస్టేబుల్ హనుమంతరావు ఆ ప్రదేశం డేంజర్ అని తెలిపేలా వర్షంలో తడుస్తూ దగ్గరలో కిందపడి ఉన్న ఓ పార్టీకి చెందిన తోరణాన్ని స్నేహితులు మునవర్, ఈశ్వర్ సహాయంతో కర్రలతో చుట్టూ కట్టాడు. దీంతో వాహనదారులు అప్రమత్తమై ప్రయాణించే వీలు ఏర్పడింది.