శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో ఇవాళ మరో అరెస్ట్ జరిగింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన పద్మకుమార్‌ను, విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్‌తో పద్మకుమార్‌కు సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో అరెస్ట్ చేసినట్టు సమాచారం.

