
వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో అమరావతి వేదికగా వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆ శాఖ అధికారులతో చర్చించిన చంద్రబాబు.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై.. 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని.. అందుకు అనుగుణంగానే.. మూడు పంటల విధానం తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు.