వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఏపీలోని తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఇటీవల తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్‌కుమార్ హత్యలో సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న వెంకట్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

