
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. అయితే తాజాగా వైఎస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి.. వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో వీరంతా పార్టీలోకి వచ్చారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, తదితరులు పార్టీలో చేరారు.