రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సినీ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ విడుదల చేశారు. ఒక నాయకుడు తన వివేకం కోల్పోతే తర్వాతి స్థాయి నాయకత్వం సాధారణంగా పరిస్థితిని సరి చేసుకుంటుంది. కానీ వైసీపీ నేతల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పార్టీ లీడర్ మాత్రమే కాక, మొత్తం క్యాడర్, తదుపరి స్థాయి నాయకత్వం కూడా వివేకం కోల్పోయినట్లు వ్యవహరిస్తోందని నాగబాబు పేర్కొన్నారు.

