
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపం ఉంటే, దానిని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చూపిస్తారా? అని ప్రశ్నించారు. అసలు వైసీపీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడంపై షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.