
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటకు స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు మ్యాచ్‌ను వీక్షించిన కోటానుకోట్ల క్రికెట్ అభిమానులే కాదు.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం ఫిదా అయ్యారు. నిండా 15 ఏండ్లు కూడా నిండని వైభవ్.. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే రికార్డు శతకం సాధించి ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. నితీశ్ కుమార్.. రాష్ట్రప్రభుత్వం తరఫున వైభవ్‌కు రూ.10 లక్షల నగదు బహుమానం ప్రకటించారు.