
వైద్య ఆరోగ్యశాఖలో సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ముఖ హాజరు గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) అభాసుపాలవుతోంది. ఉదాహరణకు ఓ ఉద్యోగి ఉదయం 9:30 గంటలకు వైద్యశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ఉద్యోగి ఉదయం 11 గంటలకు వెళ్లి ఐఫోన్‌లో టైమింగ్ సెట్టింగ్ ద్వారా ముఖ హాజరు వేసినా ఉదయం 9:30 గంటలకు హాజరైనట్లు నమోదవుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేసి ప్రస్తుతం ఆ విధంగా ట్యాంపరింగ్ చేసిన వైద్యాధికారులు 185 మంది మరో 13వేల మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు.