AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో పనిచేస్తున్న రైల్ రోబోకాప్ ASC అర్జున్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి సుమారు 8.10 గంటల సమయంలో ఒక అనుమానితుడిని గుర్తించింది. స్టేషన్లోకి ప్రవేశించిన వ్యక్తి ముఖచిత్రాన్ని ముందుగానే లోడ్ చేసిన నేరస్తుల డేటాబేస్‌తో సరిపోల్చి, వెంటనే ఈ సమాచారం విశాఖపట్నం RPF CCTV కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ రూపంలో చేర్చింది.. అప్రమత్తమైన సబ్ ఇన్స్పెక్టర్ బృందం తనిఖీలు చేసి హడప శివ (39), అతని అనుచరుడు జి. భంగారు లను అదుపులోకి తీసుకుంది.

