వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు.
దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

