
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల గుడి వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి పాల్గొన్నారు. వందలాది మంది మహిళలు, బాలికలు ఇందులో పాల్గొన్నారు. తీరొక్క పువ్వులు, గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, కట్లపువ్వులతో అలంకరించిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి.