
మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు వరంగల్‌లోని రామప్ప ఆలయం, వేయి స్తంభాల దేవాలయాలను సందర్శించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో స్థానికులు సాదదరంగా ఆహ్వానించారు. కాకతీయుల చారిత్రక కట్టడాల వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది.
- 0 Comments
- Warangal District