గత రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంగళవారం భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు. గత ప్రభుత్వ హయాంలో 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించే వారిని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఆశలకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఆశాలకు వేతనాలు చెల్లించకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

