రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యహారంలో స్టేటస్‌కో కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గే ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ అక్కడే ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని బాధితులు చేసిన విజ్ఞప్తి పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ, బాధితుల్లో 311 మంది మాత్రమే కాదని, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

