నాలుగేళ్ల ఓ చిన్నారిపై మాజీ ఆర్మీ ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. చెట్టునుంచి జామకాయ తెంపిందన్న కోపంతో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మరీ చిత్ర హింసలు పెట్టాడు. హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి చెట్టుకు ఉన్న జామకాయను తెంపింది. ఇది చూసిన మాజీ ఆర్మీ ఉద్యోగి బాలికపై రెచ్చిపోయాడు. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. పెద్ద సంఖ్యలో జనం వచ్చి బాలికను విడిపించి తీసుకెళ్లిపోయారు.

