తెల్లవారుజామున 4.24 నిమిషాలకు విశాఖ నగరాన్ని స్వల్ప భూకంపం సంభవించింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం భూమిలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సిస్మాలజీ సెంటర్ ప్రకటించింది
      
