
విశాఖలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజున జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ప్రజా ప్రతినిదులు డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులు సాగర తీరాల అందాలను వీక్షించేలా బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు మొత్తం 16 కి.మీ మేర ప్రయాణం సాగనుంది. ‘‘పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పించేందుకు 24 గంటల టికెట్‌ను రూ.500ను కేవలం రూ. 250కే ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తుంది’’ అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు..