
విశాఖలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందగా..మరో నలుగురు గాయపడ్డారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో హిమాలయ బార్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వెల్డింగ్ షాప్‌లో ఆక్సిజన్ సిలెండర్ లీక్ అయి.. భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పేలుడు ధాటికి షాపులోని ఉన్న వ్యక్తులు తునాతునకలయ్యారు. స్పాట్లోనే ముగ్గురు చనిపోగా.. గాయపడినవారిని చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.