 
		శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు దేవుని దర్శనం కోసం తరలివస్తారు. విశాఖపట్నం నుండి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని జోనల్ రైల్వే సభ్యుడు కె.ఈశ్వర్, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రాకు లేఖ రాశారు. విశాఖపట్నం – కొల్లాం మధ్య నడుస్తున్న వీక్లీ రైలును డైలీ రైలుగా మార్చాలని అభ్యర్థించారు. ప్రస్తుతం విశాఖపట్నం, కొల్లాం మధ్య ఉన్న వివేక్ ఎక్స్‌ప్రెస్, గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో 60 రోజుల ముందస్తు రిజర్వేషన్‌లో ‘regret waitlist’ చూపిస్తున్నాయని అన్నారు.
 
      
 
								 
								