
సన్ రైజర్స్ హెచ్ సీఏ కలిసి వివాదానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఫ్రాంచైజీకి చెందిన అధికారులు, హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్ సమావేశం నిర్వహించారు.
దీంతో వివాదానికి కారణమైన పాస్ ల గొడవపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా బీసీసీఐ నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఫ్రీ పాసులను మంజూరు చేయగలమని ఫ్రాంచైజీ తెలిపింది. అయితే ఇంతకుముందులాగా ఉన్నట్లుగానే ఆ పాస్ ల పంపకాలు ఉండాలని హెచ్ సీఏ రిక్వెస్ట్ చేయడంతో వివాదానికి తెరపడింది.