
భారతదేశ విమానయాన చరిత్రలో పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్, విమానం కూలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం మాత్రం ఏవియేషన్ నిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. గాల్గోకి గాలి పటం ఎగిరిన తర్వాత ఒక్క సారిగా దారం తెగిపోతే గాలిపటం ఎలా ఫ్లాట్ గా వెళ్లి క్రాష్ అవుతుందో.. అచ్చంగా విమానం కూడా అలాగే కూలిపోయింది. అలా జరగడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయన్న దానిపై నిపుణులు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు.