
నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్లు మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగరంలో 13 కంట్రోల్ రూమ్‌లు , 30 వేల మంది పోలీసులతో బందోబస్తు రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.