
కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను ప్రమాదకరంగా కడతామంటే చూస్తూ ఊరుకోమనేలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది న్యాయస్థానం.
అనుమతి పొందిన కేబుల్స్ తప్ప మిగతావి విద్యుత్ స్తంభాలకు ఉంచకూడదని, ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్ స్తంబాలను కేబుల్ వైర్లతో నింపకూడదని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ ఆదేశించింది. ఇలా విద్యుత్ శాఖ కేబుల్ వైర్స్ తొలగింపుకోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.