
నల్లగొండ జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గుర్రంపోడ్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని, డైనింగ్, పాఠశాల ఆవరణలో పరిశ్రుభతను పరిశీలించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి గణితంపై విద్యార్థుల సామర్ధ్యాన్ని పరీక్షించారు