
టెక్ జెయింట్ గూగుల్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఒక బంపరాఫర్‌తో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన విద్యార్థుల స్కిల్స్ పెంచేందుకు, ఏడాది పాటు జెమిని AI ప్రో (Gemini Pro) సూట్‌ను ఉచితంగా అందిస్తోంది. 2025 సెప్టెంబర్ 15లోపు రిజిస్టర్ చేసుకున్న 18 ఏళ్లు పైబడిన స్టూడెంట్స్ అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. AI టెక్నాలజీతో వేగంగా నేర్చుకోవడం, కాలేజీ ప్రాజెక్టులను ఈజీగా చేయడం, ఫ్యూచర్‌కి అవసరమైన స్కిల్స్‌ను నేర్చుకుని కెరీర్లో దూసుకెళ్లేలా స్టూడెంట్స్‌కు సపోర్ట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.